13 ఏండ్లుగా అన్నదానం..
ప్రతి మొహర్రం పండుగకు వితరణ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొహర్రం త్యాగదినం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంజాద్ సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు భోజనాన్ని అందజేశారు. 13 ఏండ్లుగా మొహరం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అంజాద్ తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిజాం, ఇమ్‌రోస్, అజీజ్, రవి, ఖలీల్, ఈశ్వర్, అషూ, బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
