Chemical Colors | హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో గుర్తింపు
ప్రముఖ ఫిష్ ఫ్రై కేంద్రంపై హెచ్-ఫాస్ట్ తనిఖీలు..
కృత్రిమ రంగుల వినియోగం గుర్తింపు
గడువు ముగిసిన ట్రేడ్ లైసెన్స్‌తో నిర్వహణ వెలుగులోకి
ఆహార నమూనాలు సేకరించిన అధికారులు..
తదుపరి చర్యలకు రంగం సిద్ధం
Chemical Colors | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో ఉన్న ప్రముఖ ఫిష్ ఫ్రై కేంద్రంపై హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గడువు ముగిసిన ట్రేడ్ లైసెన్స్‌తో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో పాటు, ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగులను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

హెచ్-ఫాస్ట్ ఎస్‌ఐ డి. రమ్య ఆధ్వర్యంలోని బృందం మల్లేపల్లిలోని ఫిష్ ఫ్రై కేంద్రాన్ని తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఆహార తయారీలో అనుమానాస్పద కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అనంతరం ఆహార భద్రతా ప్రమాణాల పరిశీలన కోసం ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. ప్రయోగశాల పరీక్షల కోసం వాటిని పంపించగా, నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆహార భద్రతా అధికారులు తెలిపారు. సంబంధిత నిబంధనల ప్రకారం ఆహార భద్రతాధికారి (ఎఫ్‌ఎస్‌ఓ) చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

