చేరికలపై కాంగ్రెస్ సీరియస్

తిరిగి కాంగ్రెస్ లో చేరిక
గ్రామాలలో చేరికలపై ఫోకస్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : బిఆర్ఎస్ పార్టీలో చేరికలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నది గ్రామాలలో అప్పుడే చేరికలపై కాంగ్రెస్ పార్టీ బి ఆర్ఎస్ పార్టీ దృష్టి సారిస్తున్నది. అందులో భాగంగా గురువారం నాగర్కర్నూల్ మండలం పెద్ద ముద్దనూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బి ఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి సమక్షంలో మండల మాజీ జెడ్పిటిసి శ్రీశైలం ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు సీరియస్ గా తీసుకొని కౌంటర్ కు ప్రతి కౌంటర్ గా తిరిగి ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రామ్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ లో చేరిన వారిని కాంగ్రెస్లో చేర్పించారు. తాము పొరపాటుగా టిఆర్ఎస్ లో చేరామని మళ్లీ కాంగ్రెస్లో చేరామని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పార్టీ కార్యక్రమాలను ఉదృతం చేశాయి.

ఈ నేపథ్యంలో చేరికలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చేరికలపై అధికార పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లు అధికారంలో ఉండి కూడా వేరే పార్టీలోకి తమ కార్యకర్తలు వెళ్తే ఎలా అనే కోణంలో బీఆర్ఎస్ లోకి వెళ్లకుండా జాగ్రత్తపడే ఆయా గ్రామాల నాయకత్వం దృష్టి పెట్టింది. ఏది ఏమైనా అప్పుడే చేరికలపర్వం ప్రారంభమైంది. ఆధిపత్యం తమది ఉండాలని గ్రామాలలో ఆయా పార్టీల నాయకులు ఇప్పటినుండే అధికార పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పని చేస్తున్నట్లు ఈ చేరికల ద్వారా తెలుస్తోంది. దీనికి దీటుగానే కాంగ్రెస్ అధికార పార్టీ కూడా ప్రతి కౌంటర్ గా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.