డ్రగ్స్‌కు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలి..

నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ : స్థానిక బిట్స్ కళాశాలలో ఏసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై వాటి దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని, సమాజానికి ఆదర్శంగా నిలిచేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. బిట్స్ కళాశాల చైర్మన్, సీఐ, ఎస్సైలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.