దొంగతనాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్..
- రిమాండ్ కు తరలించిన పోలీసులు
గూడూరు, ఆంధ్రప్రభ : గత రెండు రోజుల క్రితం మండల కేంద్రం లోని స్థానిక యూనియన్ బ్యాంక్ దగ్గర జరిగిన దొంగతనం కేసులో నిందితులైన వ్యక్తులను గూడూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు. నిందితులు కుత్తడి దుర్గ,బండ పూరం గ్రామం, దేవరపల్లి మండలం, పశ్చిమగోదావరి జిల్లా, యారచాని మహాలక్ష్మి, గ్రామం, మండలం భీమడోలు, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఉయ్యాల గోపయ్య గ్రామం, మండలం మైలవరం, ఎన్ టి ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లతో పాటుగా కసాని ఆనంద సతీష్ కుమార్ గ్రామం బండాపురం, మండలం దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ లను కోర్టు లో ప్రవేశపెట్టగా వారికి రిమాండ్ విధించడం జరిగిందని తెలిపారు. ఎవరైన అక్రమాలు చేపడితే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
