Maoist Dump Seized | ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ

Maoist Dump Seized | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా పోలీసులు, భద్రతా బలగాలు నిర్వహించిన కూంబింగ్‌లో కీలక విజయం సాధించారు. టెక్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, డంప్‌లో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటితో పాటు రూ.24 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మావోయిస్టుల కదలికలపై అందిన నిఘా సమాచారంతో భద్రతా బలగాలు టెక్లా అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ చేపట్టగా, ఈ డంప్ బయటపడింది. స్వాధీనం చేసుకున్న సామగ్రిని పరిశీలిస్తూ, అవి ఏ కార్యకలాపాల కోసం నిల్వ ఉంచారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు భద్రతా బలగాలు నిరంతరం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ డంప్ స్వాధీనం మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.