ఘనంగా మొహరం వేడుకలు

ఘనంగా మొహరం వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో కులమతాలకు అతీతంగా శుక్రవారం మొహరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గత 10 రోజులుగా పీరీల మండపాలను ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తూ ఉదయాన్నే పీరీలనువాడాలలో ఊరేగించారు. ఈపీరీల సవారీలో మతాలకు అతీతంగా హిందూ భక్తులు పాల్గొని మత సామారస్యానికి ప్రతీకగా నిలిచారు. చివరి రోజు పిరీలను శోభయాత్రతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఫేక్ యూసుఫ్, ఎండి బషీర్, గుండ సంతోష్, రమేష్, తాటి పల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.