అభివృద్ధే ధ్యేయం – సర్పంచ్ గున్నెల శ్రీనువాసులు
అభివృద్ధే ధ్యేయం – సర్పంచ్ గున్నెల శ్రీనువాసులు
వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల సమీపంలోని రాచూర్ గ్రామపరిధిలో గల 8,9వ వార్డుల్లో అండర్ డ్రైనేజీ పనుల నిర్మాణానికి శుక్రవారం స్థానిక సర్పంచ్ గున్నెల శ్రీనువాసులు ఆధ్వర్యంలో శ్రీకారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ నిధుల నుండి 5 లక్షల రూపాయలతో ఈ పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కాంట్రాక్టర్ పంత్ నాయక్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణేష్, వార్డు సభ్యులు సురేష్ రెడ్డి, రామార్జున్, చంద్రశేఖర్ (లాలు), గ్రామస్తులు బాలకృష్ణయ్య గౌడ్, పడకంటి వెంకటేష్, జంగయ్య, కృష్ణయ్య, శేఖర్ గౌడ్, పర్వతాలు, రమేష్, శ్రీశైలం, శ్రీను, రాజశేఖర్, ప్రహ్లాద్, బండ శ్రీశైలం, ఐలెన్, తదితరులు పాల్గొన్నారు.
