కనకదుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మవారిని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. గురువారం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోం మంత్రి అనితకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ట్రస్ట్ బోర్డు సభ్యులు అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.
