ప్రజలకు వేగవంతమైన సేవలందించడమే లక్ష్యం
నర్సంపేట, ఆంధ్రప్రభ:నర్సంపేట ఎమ్మార్వో కార్యాలయంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) హెల్ప్ డెస్క్‌ను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో ఉమారాణి, ఎమ్మార్వో రవిచంద్రారెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజలకు అవసరమైన సేవలను వేగవంతంగా అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదు, సవరణలు, ఇతర ఎన్నికల సంబంధిత సేవలను సులభతరం చేయడంలో ఈ హెల్ప్ డెస్క్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
