ఎమ్మెల్యేకు రేంజ్ అధికారి తక్షణమే క్షమాపణ చెప్పాలి

  • మాజీ చైర్మన్ బిఆర్ఎస్ నాయకుల డిమాండ్

జైనూర్, ఆంధ్రప్రభ : ఏన్నో ఏళ్ల నుండి పోడు రైతులు పోడు చేస్తున్నారని కానీ విత్తనాలు విత్తే కాలంలో ఇబ్బంది చేయకూడదని, ఇటీవల కాలంలో అసిఫాబాద్ ఆదివాసి మహిళ ఏమ్మెల్యే కోవ లక్ష్మి హైద్రబాద్ పి సిసి ఏప్ ఆధికారిణికి కలిసి పోడు సమస్యలు పరిష్కరించాలని కోరినారు,ఆదేవిధంగా కుమ్రం భీం జిల్లా పారెస్ట్ కార్యాలయంలో పోడు రైతులతో కలిసి వారికి మద్దతుగా ధర్న నిర్వహించారు, దీనిపై రేంజ్ అధికారి రమేష్ ఎమ్మెల్యే రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు చేయడం పై మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు డిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాలా, బిఆర్ఎస్ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు.

వారు గురువారం జైనూర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులను ఆదుకుంటాం అని చెబుతూనేఅటవిశాఖఆధికారులతో కావలని పోడు వ్యవసాయాని అడ్డుకుంటుందని ఇది ప్రభుత్వ ద్వందనీతిలో భాగం కాదా?అని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు, బిఆర్ఏస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షలు ఇంతియాజ్ లాల, అన్నారు. ప్రతి సారిలగే పోడు చేయడానికి వెళ్లిన రైతులను అడ్డుకున్నా అటవి శాఖ రెంజ్ ఆధికారి ఏకంగా ఏమ్మెల్యే కోవ లక్ష్మి కేవలం ఓట్లకోసం పోడు భూముల పేరిటా రాజకీయం చేస్తుందని ఆవహేళనగా మాట్లాడరని రేంజ్ ఆధికారి తక్షణమే ఏమ్మెల్యే కోవ లక్ష్మి కి క్షమపణ చేప్పాలని లేక పోతే జిల్లా పారెస్ట్ కార్యాలయం ముందు పోడు రైతులతో ఆందోళన కార్య కార్యక్రమాని నిర్వహిస్తాం హెచ్చరించారు.

ఈ రేంజ్ ఆధికారి రాజకీయాలు చేయాలని ఉంటే తన ఉధ్యోగానికి రాజీనామా చేసి పార్టీల కండువాలు కప్పి రాజకీయాలు చేయాలి, అంతే కానీ ఆధికారిగా ఉండి ఆదివాసి ఏమ్మెల్యే పైన పనికి రాని రాజకీయ కమెంట్లు చేయడం సరికాదు అన్నారు,ప్రతి పక్ష ఏమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఏక్కడ ఆన్యాయం జరిగిన ప్రభుత్వం దృష్టికి తీసుకోని పోవడం, ఆన్యాయంపైన ప్రజల పక్షణ గోంతుకై ప్రశ్నించడం ఆమె భాధ్యత కదా!అటవి శాఖకు పోడు రైతుల మధ్య ఏలాంటి వైరుధ్యలు, రాకుండ సమరస్య పూర్వకంగా పోడు సమస్య పరిష్కారంకోసం ప్రయాత్నం చేస్తున్నా ఏమ్మెల్యే కోవ లక్ష్మి పైన ఓట్ల కోసం పోడు రాజకీయం చేస్తుందని అనటం రేంజ్ ఆధికారికి తగదని తెలిపారు.

అటవి శాఖ ఆధికారిగా విధులు నిర్వహిస్తూ… పోడు రైతుల ముందు బహిరంగానే ఓట్ల కోసం ఏమ్మెల్యే రాజకీయం చేస్తుందని అనడం న్యాయమా, ప్రజా స్వామ్యంలో ప్రతిపక్ష ఏమ్మెల్యేగా పోడు రైతులకు జరుగుతున్నా ఆన్యాయాని ప్రభుత్వ తప్పిదాలను, ప్రశ్నించడం తప్ప ఏంటి అని అటవి శాఖలో విధులు నిర్వహిస్తున్నా రేంజ్ ఆధికారి రమెష్ తక్షణమే ఏమ్మెల్యే కోవ లక్ష్మి గారికి క్షమాపణ చెప్పకపోతే ఆందోళన తప్పదని వారన్నారు. ప్రభుత్వంలో పని చేసే ఆధికారి కాంగ్రేస్ ప్రజప్రతినిధిగా మాట్లాడటం ఏంత వరకు సమాంసం ఇది సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఇలాంటి ఆధికారుల మూలంగా, ప్రజలలో వ్యతిరేఖ తప్పక వస్తుంది ఆయన విమర్శించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బావ్ రావు, కుంరం శ్యాంరావు మాజీ సర్పంచ్ మెస్రం నాగోరావు, మడవి నాగోరావు, అమృత్, మాజీ ఉప సర్పంచ్ కలిల్, నర్సింగ్, బాష్కర్, శ్రవణ్, ఉమాజీ, పోడు రైతులు పాల్గొన్నారు.