Breaking | సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

  • స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఎగిసిపడుతున్న మంటలు

ఆంధ్ర‌ప్ర‌భ‌ : సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మంట‌లు చెల‌రేగుతున్నాయి. దాంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగిస్తున్నారు.

అయితే, కాంప్లెక్స్ ప‌క్క‌నున్న సూర్య‌కిర‌ణ్ బిల్గింగ్ లోని ఫ‌స్ట్ ఫ్లోర్లో చెల‌రేగిన మంట‌లు స్వ‌ప్న‌లోక్ కాంప్లెక్స్ కి వ్యాపించిన‌ట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు..