ఆలేరు కనకదుర్గాదేవి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో మూడు రోజులపాటు జరగనున్న 11వ ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ వేద పండితులు ఆలేటి రంగన్న పంతులు ఆధ్వర్యంలో వైదిక పూజలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ జడ్పిటిసి నీలం పద్మ వెంకటస్వామి తొలిరోజు పూజలకు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ కొలుపుల హరినాథ్, బేతి రాములు, తునికి దశరథ, వడ్డేమాన్ నరేందర్ తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
