ఓట్లు తొలగించేందుకు కుట్రలు..
- బీఎల్ఎలు అప్రమత్తంగా ఉండాలి..
- ప్రజలకు సహకారం అందించాలి..
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల వేములవాడ, ఆంధ్రప్రభ : ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని, బీఎల్ఎలు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం చింతల్ తానా గ్రామంలో సర్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు అర్బన్ మండల బిఎల్ఎలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సర్ ప్రక్రియపై బీఎల్ఎలు అప్రమంతగా ఉండాలని, ప్రజలకు సహకరించాలని సూచించారు.
గతంలో 2002లో ఓటర్ సవరణ కార్యక్రమం చేపడితే మళ్లీ ప్రస్తుతం జరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ బిఎల్ఎ ల దగ్గర ఉన్న ఓటర్ లిస్టులో తమ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సామాజిక అవగాహనగా ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలన్నారు. బీఎల్ఎలు ఎన్నికల సంఘం అనామాలిష్ లిస్టులో చేర్చిన ఓట్లను సరిచే న వారికి సమాచారాన్ని చేరవేయాలనరు. ఓటర్ లిస్టులో ఏదైనా కారణంతో పేర్ల లేకపోతే దరఖాస్తు ఫారం నింపి సంబంధిత సమాచారాన్ని గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులకు చేరవేయాలన్నారు.
గల్ఫ్ వెళ్లిన వారు, విదేశాల్లో చదువుకున్న వారు వివరాలు వారి కుటుంబ సభ్యులు బిఎల్ఎలకు వారి వివరాలు ఇవ్వాలన్నారు. వారి కుటుంబ సభ్యులు అఫిడవిట్ రూపంలో అధికారులకు వివరాలు సమర్పించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో డప్పు చాటింపు, మైకులో చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికి చాలా గ్రామాల్లో 80 శాతం పైగా ఓటర్ మ్యాపింగ్ జరిగిందని, ఇటీవలే నియోజకవర్గస్థాయిలో బిఎల్ఎలు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు.
బీజేపీ ప్రమాదకరంగా మరి ప్రశ్నించే గొంతులను, ప్రతి పక్ష వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ ఓట్ల చోరీ చేస్తూ దేశంలో ప్రమాద కారణంగా మారిందని, బెంగాల్, తమిళనాడు, వంటి రాష్ట్రాల్లో బీజేపీకి నచ్చని వారి ఓట్లు లక్షల్లో తొలగిస్తుందన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 36వేల ఓట్లు తొ లగించారన్నారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటర్ లిస్టులో తమ ఓటు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అర్బన్ మండల సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
