జోరు అందుకున్న వ్యవసాయ పనులు
కుంటాల , ఆంధ్రప్రభ: మండల కేంద్రమైన కుంటలతో పాటు ఆయా గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి దీంతో రైతులు మంగళవారం రాత్రి బుధవారం కురిసిన వర్షానికి రైతులు సంబరపడుతూ పంట క్షేత్రాల్లో విత్తనాలను వితుక్కున్నారు దీంతో పత్తి సోయా పంటలతో పాటు మొక్కజొన్న పంటలు రైతులు సాగు చేస్తున్నారు ఇప్పటికే మృగశిర కార్తె 15 రోజులు గడిచినప్పటికీ వర్షాల కోసం ఎదురుచూశారు అయితే గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రైతులు పంట క్షేత్రంలో పనులకు బిజీబిజీగా కనిపించారు దీంతో పత్తి సోయా పంటలను వేశారు దీంతో మండల వ్యాప్తంగా ఎటుచూసినా పంట క్షేత్రాల్లో కూలీలతో కళకళలాడాయి.
