బిఎల్ వో లకు మెటీరియల్ కిట్ల పంపిణీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా సవరణ, ఇంటింటి సర్వే, మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం (ఈ సి ఐ) మార్గదర్శకాల ప్రకారం బూత్ లెవల్ ఆఫీసర్లకు (బి ఎల్ వో) లకు ప్రత్యేక మెటీరియల్ కిట్లను బుధవారం పంపిణీ చేసినట్లు తహసీల్దార్ ఎం. నరేష్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి సార్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిసన్ ) ప్రారంభం అవుతుందని, బి ఎల్ వో లకు మెటీరియల్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్, బి ఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.