పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఎంపిక

భీంగల్ టౌన్ / రూరల్, ఆంధ్రప్రభ: భీంగల్ మండల పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం, సమస్యల పరిష్కారం మరియు సంఘ బలోపేతం లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎంపిక చేశారు. ఎన్నికలు ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా సి. జితేందర్, ప్రధాన కార్యదర్శిగా శివసారి సంజయ్, కోశాధికారిగా సీహెచ్. రమ్య, ఉపాధ్యక్షులుగా ఆర్. అనిల్, జాయింట్ సెక్రటరీగా సీహెచ్. రాకేష్, మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా జీ. స్వప్న ఎంపికయ్యారు.

అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్-1గా బి. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్-2గా ఎం. అంజయ్య, మెంబర్ సలహాదారు-1గా ఏ. నవీన్ గౌడ్, మెంబర్ సలహాదారు-2గా ఎన్. ప్రశాంత్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.