నల్గొండలో సిటీ బస్సుల ప్రారంభం.. బస్టాండ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన
నల్గొండ, ఆంధ్రప్రభ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నల్గొండ నగరంలో ప్రజల రవాణా సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన రెండు సిటీ బస్సులను మంత్రి ప్రారంభించారు. నగర ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ప్రజాపాలన నివేదిక జిల్లా ప్రత్యేక అధికారి గౌరప్పల్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
