ఊట్కూర్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన పావని

ఊట్కూర్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన పావని

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా పావని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం చేపట్టిన పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మరికల్ ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆమెకు పదోన్నతి లభించగా, ఊట్కూర్ ఎంపీడీవోగా నియామకం జరిగింది. ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన కిషోర్ కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.

నూతన ఎంపీడీవోకు కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ మండల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, గ్రామ పంచాయతీల బలోపేతం, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, ఉపాధి హామీ పనుల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు రమేష్, కిషోర్ కుమార్, ఎంపీవో బాలాజీ, ఏపీవో లక్ష్మీరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని పావనికి శుభాకాంక్షలు తెలిపారు.