మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

మోపిదేవి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను మంత్రికి అందజేశారు.

మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.