ఏనుమాముల మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల సెలవులు

ఏనుమాముల మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల సెలవులు

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు ముందస్తుగా గమనించాలని సూచించారు.

శుక్రవారం మొహరం పండుగ సందర్భంగా, శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉండటంతో మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చే విషయంలో ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని మార్కెట్ కమిటీ సూచించింది.