మోపిదేవికి చేరుకున్న మంత్రి లోకేష్
మోపిదేవికి చేరుకున్న మంత్రి లోకేష్
మోపిదేవి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం మోపిదేవి మండలానికి విచ్చేశారు. అశేష అభిమానుల నడుమ ఆయనకు ఘన స్వాగతం పలికారు. డప్పువాయిద్యాల నడుమ సందడి వాతావరణంలో ఆయనను టీడీపీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. పూలదండలు వేసి పూలవర్షంతో మోపిదేవి జాతీయ రహదారి పై పార్టీ శ్రేణులు అభిమానాన్ని చాటుకున్నారు. జై తెలుగుదేశం జైజై తెలుగుదేశం పార్టీ అంటూ నారా లోకేష్ నాయకత్వం వర్థిల్లాలంటూ పార్టీ శ్రేణులు హోరెత్తించారు.
అనంతరం కొక్కిలిగడ్డలో దాతల సహకారంతో నిర్మించిన జడ్పీ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించేందుకు మంత్రి లోకేష్ వెళ్లారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ తదితరులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

