అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆపారు.. తనిఖీ చేయగా షాకింగ్‌

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: గంజాయితో అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని అరెస్టు చేసినట్లు సీఐ పులి రమేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం గ్రామ శివారులో ఉన్న రిలయన్స్ గ్యాస్ వద్ద సోమవారం సాయంత్రం ఐదు గంటలకు దండేపల్లి గ్రామానికి చెందిన చిలుకా సిద్దు(20 )అనే యువకుడు అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది.

అతన్ని ఎస్సై నరసింహరావు తన సిబ్బందితో కలిసి పట్టుకొని విచారించగా అతని వద్ద సుమారు 97 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని మహారాష్ట్రలోని, బళ్లార్షా జిల్లాలో కొనుగోలు చేసి తన ఇంటికి పట్టుకొని వెళుతుండగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై నరసింహారావు పోలీస్ సిబ్బంది ఉన్నారు.