పద్మశ్రీ అందుకున్న రోహిత్ శర్మ
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం స్వీకరణ
- ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత మాజీ కెప్టెన్‌కు అరుదైన గౌరవం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ లభించింది. ఈరోజు (మంగళవారం జూన్23న) ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రోహిత్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ ఏడాది జనవరిలో పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, రోహిత్ శర్మతో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. హర్మన్‌ప్రీత్ ఇప్పటికే గత నెలలో ఈ పురస్కారాన్ని స్వీకరించగా, తాజాగా రోహిత్‌కు రాష్ట్రపతి అవార్డును ప్రదానం చేశారు.
అవార్డు కార్యక్రమానికి రోహిత్ తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించినందుకు రోహిత్ శర్మకు ఈ గౌరవం లభించింది. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కీలక విజయాలు అందించిన రోహిత్, ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.
దేశ రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, నటుడు మమ్ముట్టి, గాయని అల్కా యాగ్నిక్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో సత్కారాలు అందుకున్నారు.
