Amanagallu దశలవారీగా కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా
Amanagallu దశలవారీగా కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా
- మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్
ఆమనగల్లు (Amanagallu), ఆంధ్రప్రభ: ఆమనగల్లు పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని, దశలవారీగా ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లోని పరిసరాలను ఆయన మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆయా కాలనీలలో పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రత పనులు నిర్వహింపజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ పత్యనాయక్ మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహకారంతో పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యంగా వార్డుల్లో పారిశుద్ధ్య పనులకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చైర్మన్ వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
