ఘనంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు
కోదాడ, (ఆంధ్రప్రభ): కోదాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
గ్రామ గ్రామాన, వాడవాడలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
