ఖమ్మంలో ఘనంగా వంగవీటి జయంతి వేడుకులు..

ఖమ్మం , ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా కేంద్రంలో వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను మున్నూరు కాపు సంఘం యుత్ ఘనంగా నిర్వహించారు. మున్నూరుకాపు సంఘం యూత్ అధ్యక్షుడు తోట రమేష్ కుమార్ పిలుపు మేరకు యూత్ భారీగా ఎంబి గార్డెన్ వద్దకు చేరుకున్నారు. మున్నూరుకాపు సంఘం జిల్లా నాయకులు జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు.

వంగవీటి మెహన రంగా చిత్రపటాలు, జెండాలతో యువత బైకులపై కాల్వోడ్డు మీదుగా గాంధీచౌక్, గ్రెయిన్ మార్కెట్ రోడ్, బోస్ బొమ్మ ప్రాంతం మీదుగా శ్రీనివాస నగర్, చర్చికౌంపౌండ్ నుండి జెడ్పి సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ గట్టయ్య సెంటర్ నుండి బైపాస్ రోడ్డుమీదుగా ఏంబి గార్డెన్ వరకు భారీ బైకు ర్యాలీ నిరహించారు. అనంతరం ఏంబి గార్డెన్ లో వంగవీటి మోహన రంగా చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అభిమానుల సందోహం మధ్య కేకే కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం, రాష్ట్ర జిల్లా నేతలు మాట్లాడుతూ.. వంగవీటి మోహన రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ విజయవాడ కేంద్రంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశాడని వారు కొనియాడారు. అట్టడుగున్న వర్గాల కోసం గూడు నిర్మించేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆనాటి పాలకులు ఆయనను అంతం చేశారు. కానీ ఆయన ఆశయ సాధన మాత్రం అంతం చేయలేక పోయారు.

వంగవీటి మోహన రంగా చూపిన బాటనే నేటికీ వారి ఆశయ సాధన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై నిత్యం గలమెత్తుతూనే ఉన్నామని వారు తెలిపారు.. వంగవీటి మోహన రంగా ఆశయ సాధన కోసం మున్నూరు కాపు కులస్తులు ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు.

బైక్ ర్యాలీ, అన్నదాన కార్యక్రమంలో.. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పొదిల రవికుమార్ కొత్త సీతారాములు, ఆకుల గాంధీ, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, ఆర్ జె సి కృష్ణ,పసుపులేటి దేవేందర్,మడూరి పూర్ణ, పగడాల కిషోర్, సోదా నరసింహారావు, హారిక నాయుడు, ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు తోట రమేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్, సుంకర చిరంజీవి,పాల్వంచ రాజేష్, రాపర్తి రాజా, దినేష్ నాయుడు,నానాభాల హరీష్, ఆకుల వినయ్, గణేష్ నాయుడు, గుణా, శాసనాలా సాయి రాం, అన్వేష్ నాయుడు, పారా ఉదయ్ కిరణ్ నాయకులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.