AP | ముత్యాలంపాడులో ఉద్రిక్తత..
టీడీపీ-వైసీపీ రెండు వర్గాల బాహాబాహీ. ..
ఒకరిపై ఒకరు దాడికి యత్నించిన రెండు వర్గాలు..
ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెస్తున్న పోలీసులు..
AP | పాయికాపురం, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): విజయవాడలోని ముత్యాలంపాడు ప్రాంతంలో టీడీపీ – వైసీపీ రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని బాహాబాహీకి దారితీసింది. పరస్పరం దూషణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దాడికి యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

