Nagarkurnool భారీ ఈదురుగాలులకు పారాబైల్డ్ రైస్ మిల్ ధ్వంసం
Nagarkurnool భారీ ఈదురుగాలులకు పారాబైల్డ్ రైస్ మిల్ ధ్వంసం
- సుడిగాలితో కూడిన భారీ వర్షం
- భారీ మిషనరీ,షెడ్డు ధ్వంసం
- మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం నీటిపాలు
- పారాబైల్డ్ రైస్ మిల్ కు భారీ నష్టం
- 8 నుంచి 10 కోట్ల భారీ నష్టం
నాగర్ కర్నూల్ (Nagarkurnool), ఆంధ్రప్రభ :
నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులకు శ్రీ సీతారామాంజనేయ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు లో భారీ ఎత్తున ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రైస్ మిల్లు యజమానులు బిల్లా కంటి రాజ్యలక్ష్మి, రవికుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో ఒక్కసారి సుడిగాలి చుట్టుకోవడంతో రైస్ మిల్లు పై భాగంలోని కప్పు ఇతర మిషనరీ కి సంబంధించిన భారీ పైపులు ఇతర నిర్మాణాలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

మిషనరీ, రైస్ మిల్ షెడ్డు కుప్పకూలిపోయింది. దీంతో భారీ ఇనుప పైపులు మిషనరీ మోటర్లు నేలకూలాయి. దీంతోపాటు రైస్ మిల్లులో ప్రాసెసింగ్ లో ఉన్న వడ్లు బియ్యం తడిసి ముద్ద అయ్యాయి.దాదాపు 8 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు రైస్ మిల్లు యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సుడిగాలితో కూడిన వర్షం రైస్ మిల్లును చుట్టుముట్టిన సమయంలో యాజమాన్యం వారు అప్రమత్తమై కార్మికులను అందరినీ ఒక చోటికి చేర్చడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు కార్మికులు పేర్కొన్నారు.
ఇంతటి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం రావడం ఒక రైస్ మిల్లు ధ్వంసం కావడంతో ఈ అంశం చర్చనీ అంశంగా మారింది. పూర్తిస్థాయి అంచనా తర్వాతే రైస్ మిల్లుకు దాదాపు 8 కోట్ల రూపాయలు నష్టం రైస్ మిల్ యజమాని బిళ్ళ కంటి రవి తెలిపారు.

