లోక కళ్యాణార్థం చండీ హోమం..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వర్షాలు సమృద్ధిగా కురవాలని లోకకళ్యాణార్థం శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో చండీ హోమం నిర్వహించారు. సోమవారం అమావాస్య పురస్కరించుకొని 34 డివిజన్ శివనగర్ శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ, అర్చకుల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి అభిషేక్ శర్మ మాట్లాడుతూ నైరుతి పవనాలు రాష్ట్రం లోకి వచ్చిన వర్షాలు లేకపోవడంతో ప్రజలు, అల్లాడుతున్నందున సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆలయ అభివృద్ధి కమిటీ నేతృత్వంలో చండీ హోమం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. చండీ హోమం అనంతరం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
