బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లింగాపూర్ మాజీ సర్పంచ్ గోసుకుల మల్లేష్ తల్లి ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, ఆర్టీఏ సభ్యుడు మల్లేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముసుకు రాజు, రాజేశ్వర్, మహమ్మద్ సలీం, నారాయణ, భూమన్న, నరేష్, ప్రసాద్, డజ్జు, వాహబ్, ఎర్రన్న, ధర్మయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
