Kurnool విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా మధుసూదనరావు
Kurnool విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా మధుసూదనరావు
కర్నూలు బ్యూరో (Kurnool), ఆంధ్రప్రభ:
కర్నూలు జిల్లాలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వీ అండ్ ఈ) విభాగానికి కొత్త డీఎస్పీని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా క్రైమ్స్ (సీసీఎస్) డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బి.వి. మధుసూదనరావును బదిలీ చేస్తూ కర్నూలు వీ అండ్ ఈ డీఎస్పీగా నియమించారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు (పీఈబీ) సిఫార్సుల ఆధారంగా ఈ బదిలీ, పోస్టింగ్ చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సమావేశంలో అధికారుల సేవా వివరాలను పరిశీలించిన అనంతరం మధుసూదనరావు పేరును సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. ఆ సిఫార్సుల మేరకు ఆయనను కర్నూలులో ఖాళీగా ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ పదవికి నియమించారు.
మధుసూదనరావు తక్షణమే కొత్త బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు సంబంధిత అధికారులకు ఆయనను వెంటనే రిలీవ్ చేసి, కొత్త స్థానంలో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయం సూచించింది.
కర్నూలులో కొంతకాలంగా ఖాళీగా ఉన్న వీ అండ్ ఈ డీఎస్పీ పోస్టుకు నియామకం జరగడంతో ఆ విభాగంలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి.
