Mega DSC Irregularities | మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు

Mega DSC Irregularities | మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు

Mega DSC Irregularities | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల, డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదని ఆరోపించారు. మెగా డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని, ఈ అంశంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాధ్యత నుంచి తప్పించుకోలేరని సజ్జల స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపైనా ఆయన విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల పోలింగ్‌ దశ నుంచే కూటమి అరాచకాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. సూపర్-6 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా ప్రజలను మోసగించడానికే పరిమితమైందని, ప్రస్తుత టర్మ్ ఆయనకు రాజకీయంగా చివరిదవుతుందని వ్యాఖ్యానించారు. కూటమి పాలనలో అన్ని రంగాల్లో అవినీతి పెరిగిందని కూడా ఆరోపించారు.

Leave a Reply