బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఘన సన్మానం వీడ్కోలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు పదోన్నతులు సహజమని విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుందని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎంపీవో బాలాజీ,సర్పంచ్ లు జయప్రకాశ్ రెడ్డి, ఆంజనేయులు, ఎండిజాఫర్, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నారాయణపేటజిల్లాఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో బదిలీపై వెళ్లిన సూపరిండెంట్ కొండన్న, జూనియర్ అసిస్టెంట్ జగదీష్ లను అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించివీడ్కోలుపలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు ప్రజలకు ప్రజా ప్రతినిధులకు నిరంతరం అందుబాటులో ఉండి వివిధ సంక్షేమ పథకాలు మంజూరుచేస్తారనిఅన్నారు.

అంకితభావంతో సేవ చేస్తే గుర్తింపు లభిస్తుందని ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేస్తే ప్రజల మన్ననలు పొందుతారని అన్నారు. బదిలీపై వెళ్తున్న సూపర్డెంట్ కొండన్న ఇన్చార్జి ఎంపీడీవో గా గతంలో టైపిస్టుగా ఊట్కూర్ మండలంలో సుదీర్ఘంగా విధులు నిర్వహించారని కొనియాడారు. బదిలీపై కొండన్న కొత్తపల్లి ఇన్చార్జి ఎంపీడీవో గా వెళ్లడం సంతోషంగా ఉన్న తమ మండలం నుండి వెళ్తుండడం బాధాకరమైన విషయంఅన్నారు. జూనియర్ అసిస్టెంట్ జగదీష్ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తూ నారాయణపేట జెడ్పి కార్యాలయానికి బదిలీపై వెళ్లడంతో తమకు జడ్పీ కార్యాలయంలో పనులు సమయాసంగా చేపట్టి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఉద్యోగులు సమయపాలన పాటించడంతోపాటు వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వారధిగా ఉండాలన్నారు. కొండన్న జగదీష్ చేపట్టిన సేవలు పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డి, రైతుబంధు మాజీ మండలాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సూపర్డెంట్ పార్వతమ్మ, సీనియర్ అసిస్టెంట్ విద్యారాణి ఉపాధిహామీ ఏపీవో లక్ష్మీరెడ్డి, ఈసీ మహిపాల్ రెడ్డి, టైపిస్టు అంబికా ఉపాధి హామీ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.