కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యం

కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యం

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: కార్యకర్తల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బొర్రా నాగ శ్రీనివాస్ పాము కాటుకు గురై మృతి చెందగా, పార్టీ సభ్యత్వం ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు రూ.5 లక్షలను గురువారం అందజేశారు. మృతుడి భార్య అనూషకు వీరంకి వెంకట గురుమూర్తి, కనపర్తి శ్రీనివాసరావు చెక్కు అందజేశారు.

శ్రీనివాస్ పిల్లల చదువుకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అవకాశం కల్పిస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ, పార్టీ నాయకులు మండలి రామమోహనరావు, మెగవత్తు గోపి, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, దాసినేని శ్రీనివాసరావు, కొండవీటి మధు, కంచర్ల ఆనంద్, ముళ్లపూడి శ్రీనివాసరావు, కొండవీటి గోవిందు, చెన్ను గోపి, కమ్మిలి సుబ్రహ్మణ్యం, రేపల్లె నాగబాబు, నాగిడి సుబ్రహ్మణ్యం, యక్కటి అర్జునరావు, గాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply