Teaser | ఇంట్రెస్టింగ్ గా స్ల‌మ్ డాగ్..

Teaser | ఇంట్రెస్టింగ్ గా స్ల‌మ్ డాగ్..

పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘Slum Dog – 33 Temple Road’ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ వచ్చేసింది. ఇప్పటికే పోస్టర్లతో అంచనాలు పెంచిన చిత్ర బృందం.. తాజాగా టీజర్‌తో సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

కళ్లకు గంతలు కట్టుకుని, చేతిలో రక్తపు మరకలతో ఉన్న కత్తిని పట్టుకున్న విజయ్ సేతుపతి లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీజర్‌లో చూస్తుంటే విజ‌య్ సేతుప‌తి ఒక బ్లైండ్మెన్ క్యారెక్ట‌ర్ ప్లే చేస్తున్న‌ట్టు తెలుస్తొంది. ఒక ప్రమాదకరమైన, ఊహించని నేపథ్యం ఉన్న వ్యక్తిగా చూపించారు. పూరి జగన్నాథ్ మార్క్ రగ్డ్ ప్రెజెంటేషన్, డార్క్ విజువల్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన బలాలుగా నిలిచాయి.

టీజర్ చూస్తుంటే ఇది కేవలం మాస్ యాక్షన్ సినిమా కాదని, స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామా అని అర్థమవుతోంది. ’33 Temple Road’ అనే సబ్ టైటిల్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? విజయ్ సేతుపతి పాత్ర ఎందుకు అంత హింసాత్మకంగా మారింది? అనే ప్రశ్నలను టీజర్ ప్రేక్షకుల ముందుంచింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. పూరి జగన్నాథ్ శైలిలో యాక్షన్, ఎమోషన్, డ్రామా మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకంగా విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ కాంబినేషన్ తొలిసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అటు తమిళంలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఏర్పడింది.

ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతితో పాటు టబు, సంయుక్త, దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. టీజర్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన ‘స్లమ్ డాగ్’.. విడుదల తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Leave a Reply