రేపు పశ్చిమలో పీజీఆర్ఎస్ రద్దు
రేపు పశ్చిమలో పీజీఆర్ఎస్ రద్దు
- సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రద్దు..
- కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో రేపు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.
జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రేపు రావద్దని, తదుపరి సోమవారం సాధారణంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
