మా పాఠశాలలో నాణ్యతమైన విద్యను అందిస్తాం.

మా పాఠశాలలో నాణ్యతమైన విద్యను అందిస్తాం.

ఉపాధ్యాయుల బడిబాట

దండేపల్లి, ఆంధ్రప్రభ : మా పాఠశాలలో నాణ్యతమైన విద్యను అందిస్తాం మీ పిల్లలను పాఠశాలకు పంపండి అని ఉపాధ్యాయులు బడిబాట పట్టారు.దండేపల్లి మండలం నంబాల గ్రామంలో శనివారం వెల్గనూర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ‘బడిబాట’ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే లక్ష్యంతో ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేపట్టారు.​ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, పాఠశాల వయస్సు ఉన్న పిల్లలను గుర్తించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ప్రభుత్వం కల్పిస్తున్న మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడ్డాయని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వారు కోరారు. ​ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బొలిశెట్టి రాజన్న, వేణుగోపాల్, సతీష్, ప్రవీణ్ కుమార్ లతో పాటు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply