4-Men-Ap-Local-Fight : ఏపీలో లోకల్ హీట్ Andhra Prabha Top Story
4-Men-Ap-Local-Fight : ఏపీలో లోకల్ హీట్ Andhra Prabha Top Story
- అటు సీబీఎన్
- ఇటు పవన్:
- నడుమ మాధవ్
- జనంలో.. జనంతో సందడి
- వీధుల్లో వైసీపీ ఎదురుదాడి
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)
ఏపీలో స్థానిక ఎన్నికల జాతర మొదలైంది. ఇటు టీడీపీ అధినేత సీబీఎన్.. అటు జనసే దళపతి పవన్.. నడుమ బీజేపీ అధ్యక్షుడు వీఎన్ మాధవ్ ఎన్నికల వ్యూహంలో మునిగి తేలుతున్నారు. ఇక వైసీపీ కూడా స్థానిక పోరుకు సిద్ధమైంది. అధికార పక్షంపై ఆరోపణల దూకుడు పెంచింది. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేయడంతో రాజకీయ జాతర మరియు సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ లక్ష్యంతో వ్యూహాలు రచిస్తుండగా, వైసీపీ ఎదురుదాడికి సిద్ధమవుతోంది
4-Men-Ap-Local-Fight : టీడీపీ పక్కాప్లాన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంత్రులు, కూటమి నేతలతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నాటి గెలుపు ఊపును స్థానిక సంస్థల్లోనూ కొనసాగించాలని, ఎక్కడా ఓట్లు చీలిపోకుండా ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. గతంతో పోల్చితే చంద్రబాబు అనూహ్య మార్పు వచ్చింది. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకొంటున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పేదల సేవలో.. గా మార్చివేశారు. నేరుగా లబ్ధిదారులతో కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుని.. తక్షణ సాయం అందిస్తున్నారు. ఓక సీఎం తన ఇంటి గడపలోకి వచ్చి .. పరామర్శంచటంతో… జనంలో సీబీఎన్ ఇమేజ్ పెరుగుతోంది. రైతులు, రోజువారీ కూలీలతోనూ సీఎం మాటామంతీ.. టీడీపీకి మంచి మైలేజీ ఇస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, సునరిపాలన నినాదంతో ఎన్డీయే ప్రస్తుతం దూసుకుపోతోంది. ఇక గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీని తూర్పారబట్టేస్తున్నారు. ఇలా ప్రజల్లో.. ప్రజల కోసం.. ప్రజల మనిఫిగా.. చంద్రబాబు కొత్త అవతారంలో.. సరి కొత్త రాజకీయాలను పరుగులు పెట్టిస్తున్నారు.
4-Men-Ap-Local-Fight : తోడుగా జనసేన

జనసేన యాక్షన్ ప్లాన్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలం..బలగాన్ని పెంచే దిశలో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకులకు ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. ఇక క్షేత్రస్థాయిలో కీలక ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు ప్రారంభం కాగ.. ఉత్తరాంధ్రలో జనసేన పుంజుకుంటోంది. విజయనగరంచ శ్రీకాకుళం పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో పలువురు వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో జనసేనకు మంచి పునాది ఉంది. కొస్తాలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా.. డిప్యూటీ సీఎం గ్రామీణ పరిస్థితులపైనే దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన.. తదితర అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. కూటమి భాగస్వామిగా .. సమన్వయంతో సాగుతున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీనివాస్ ను విప్ పదవి నుంచి తొలగించారు. ఇక ఆద్మాత్మిక భావజాలంతో.. హిందూ ధర్మం పరిరక్షణ నినాదంతొ,,, ఊరూరా పవన్ గాలి వీచే స్థితికి తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
4-Men-Ap-Local-Fight : బీజేపీ సైతం …

ఇక బీజేపీ సైతం .. బిజీబిజీగా పావులు నడుపుతోంది. ఇటీవల రాజకీయ, సామాజిక సన్నాహక రంగాలుగా మూడు ప్రధాన కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ్ అభియాన్ (శిక్షణా తరగతులు) బీజేపీ తన క్షేత్రస్థాయి శ్రేణులను బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సమర్థవంత నాయకత్వాన్ని తయారు చేయడం. జూన్ 3న కృష్ణా జిల్లా పునాదిపాడులో జరిగిన జిల్లా స్థాయి శిక్షణలో కేంద్ర మంత్రి బి. శ్రీనివాస వర్మ పాల్గొని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు మే చివరలో విజయవాడలో రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ప్రారంభించారు. మోదీ 12 ఏళ్ల పాలనపై ప్రజా చైతన్య కార్యక్రమాలు చేట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ నెల జూన్ 5 నుండి జూన్ 21 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్, పీఎం-కిసాన్ వంటి కేంద్ర పథకాల లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం.బీజేపీ నాయకులు, మంత్రులు (ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో సహా) కేంద్ర నిధులతో నడుస్తున్న ప్రాజెక్టులను సందర్శించి ప్రచారం చేస్తున్నారు.3. ‘యోగాంధ్ర 2026’ ప్రచారం (జూన్ 7 నుండి ప్రారంభం)జూన్ 21న రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ భాగస్వామ్యంతో ఏపీ కూటమి ప్రభుత్వం ‘యోగాంధ్ర 2026’ పేరుతో 14 రోజుల భారీ ప్రచార కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. బీజేపీకి చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జూన్ 6 (ఈ రోజు) నుండి దీని కొరకు ప్రత్యేక పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాటి చెట్ల సంరక్షణ (జూన్ 5)ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా ఏపీ బీజేపీ కార్యాలయంలో ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గీత కార్మికుల (గౌడ, శెట్టిబలిజ తదితర కులాల) జీవనోపాధి రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల తాటి మొక్కలను నాటే ప్రత్యేక కార్యాచరణను పీవీఎన్ మాధవ్ ప్రకటించారు.వీటితో పాటు, త్వరలో రాబోయే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా పార్టీ క్యాడర్‌ను వార్డుల వారీగా సిద్ధం చేసే పనిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం బిజీగా ఉంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ లైన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో కమలదళం కూడా క్షేత్రస్థాయి ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది. వైఎస్సార్సీపీ గత పాలనలోని వైఫల్యాలను, ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కూటమి పక్షాల మధ్య సమన్వయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
4-Men-Ap-Local-Fight : వైసీపీ ఎదురుదాడి

గత అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత వైసీపీ ఈ స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అధికార కూటమిపై ఎదురుదాడికి సిద్ధమైంది.’వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే బుక్‌లెట్‌ను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, జూన్ 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్‌హాల్ సదస్సులు, జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించేలా వైఎస్ జగన్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు.వైసీపీ ప్రధాన ఆరోపణలు:చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.నిరుద్యోగం, పడిపోతున్న జీఎస్టీ రాబడులు, పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం వంటి ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్నారు.మహిళలకు, రైతులకు ఇచ్చిన ఉచిత పథకాల హామీలను ఎప్పుడు అమలు చేస్తారని గట్టిగా ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి, ఒకవైపు ఓటర్ల జాబితా సవరణలు జరుగుతుండగా.. మరోవైపు పార్టీల మార్పులు, పరస్పర ఆరోపణలతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ముందే హీటెక్కింది.
A;SO READ : Cm-Cycle-Ride : ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. Andhra Prabha Top News
