HYD | బీటెక్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

HYD | బీటెక్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హాల్ టికెట్ ఇవ్వలేదని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘ‌ట‌న హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన మ్యాదరి ప్రణీత్ కుమార్(22).. తండ్రి కాంట్రాక్ట్​ ఆర్టీసీ డ్రైవర్​గా పనిచేస్తుండగా.. హయత్​నగర్​లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామ పరిధిలోని శ్రీ ఇందు కాలేజీలో కంప్యూటర్​ సైన్స్​(సీఎస్సీ – డీ) బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఎగ్జామ్స్​ టైమ్​ కావడంతో ఫీజు డ్యూ ఉందని కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రణీత్ శనివారం సాయంత్రం ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. కాలేజీ ముందు తల్లిదండ్రులు, బంధువుల ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హయత్ నగర్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు​ గౌడ్ తెలిపారు.

Leave a Reply