Indigo Flight | రన్‌వేపైనే ఆగిపోయిన ఇండిగో విమానం

Indigo Flight | రన్‌వేపైనే ఆగిపోయిన ఇండిగో విమానం

Indigo Flight | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం సాంకేతిక లోపం కారణంగా సింగపూర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్‌వేపైనే నిలిచిపోయింది. టేకాఫ్‌కు సిద్ధమైన సమయంలో లోపం గుర్తించడంతో విమానాన్ని నిలిపివేశారు. దీంతో 133 మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

సింగపూర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఉదయం 9:40 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే రన్‌వేపైకి చేరుకుని టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని వెంటనే నిలిపివేశారు.

విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. సమస్య పరిష్కారానికి ఇండిగో సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టాయి. లోపాన్ని త్వరితగతిన సరిచేసి విమానాన్ని గమ్యస్థానానికి పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply