MLA | టీడీపీ నేతకు మాతృవియోగం

MLA | టీడీపీ నేతకు మాతృవియోగం
MLA | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొప్పలపూడి జగదీష్ మాతృమూర్తి, సర్పంచ్ దొప్పలపూడి గంగాభవాని అత్త దొప్పలపూడి సరోజిని (79) గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. సరోజిని మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, బుల్లిబాబు, మౌళి పాల్గొన్నారు.
