క్యాతనపల్లిలో పచ్చదనానికి పిలుపు.. మొక్కలు నాటిన చైర్‌పర్సన్ సంధ్యారాణి

క్యాతనపల్లిలో పచ్చదనానికి పిలుపు.. మొక్కలు నాటిన చైర్‌పర్సన్ సంధ్యారాణి

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి–రాజా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. పచ్చని చెట్లు ప్రాణవాయువును అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

“పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలు, కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెద్ద చెట్లుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత–శ్రీనివాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply