PillarNumberA1043 | అమీర్‌పేట్‌లో ఫైర్ యాక్సిడెంట్‌..

PillarNumberA1043 | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అమీర్‌పేట్‌లోని శ్రీనివాసనగర్‌ వెస్ట్‌ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో పిల్లర్‌ నంబర్‌ A1043 సమీపంలోని కేఎస్ఆర్‌ ఫ్యాషన్స్‌ వద్ద మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అగ్ని ప్ర‌మాదం కార‌ణంగా మెట్రో రైళ్లు స్వ‌ల్ప ఆల‌స్యంగా న‌డుస్తున్న‌ప్ప‌టికీ, సేవ‌లు నిలిపివేయ‌లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. మియాపూర్‌-ఎల్బీన‌గ‌ర్‌, నాగోల్-రాయ‌దుర్గం మార్గాల్లో మెట్రో రాక‌పోక‌లు య‌థావిధిగా కొన‌సాగుతున్నాయి. మంట‌లు అదుపులోకి వ‌స్తుంద‌టంతో మెట్రో సేవ‌ల‌కు ఎలాంటి ఇవ్వందులు లేవ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

Leave a Reply