AP | సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ భేటీ..

AP | సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ భేటీ..

  • కృష్ణా-గోదావ‌రి బేసిన్ ప్రాజెక్టులపై చర్చ

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ నేడు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి బేసిన్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో ఓఎన్‌జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలు మరియు ఇంధన రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి అరుణ్ కుమార్ సింగ్ తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బి. సి. జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఓఎన్‌జీసీ అధికారుల బృందం సభ్యులు పాల్గొన్నారు.

అనంతరం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం ముగిసిన తర్వాత ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక పాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, యోగా-నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Leave a Reply