గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ మాజీ కానిస్టేబుల్

హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించి ఏకంగా 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న కేరళ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శివకృష్ణ అరెస్టు చేశారు.

ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు వీరిని రిమాండ్‍కు తరలించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ వివరాల ప్రకారం పోలీసుల చేతికి చిక్కిన నిందితుడి పేరు కానిస్టేబుల్ శివకృష్ణ క్రైమ్ రికార్డు పోలీసులతో సహా అందరిని షాక్‍కు గురి చేస్తోంది.

నిందితుడు గతంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‍గా పని చేశాడని ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసై గంజాయి అక్రమ రవాణాను తన వ్యాపారంగా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా కేసులో శివకృష్ణ పోలీసులకు దొరికిపోవడం ఇదేం మొదటిసారి కాదని గతంలో కూడా రెండు సార్లు గంజాయితో పట్టుబడి సస్పెండ్ అయినట్లు తెలిపారు. అయినా బుద్ధి మార్చుకోని శివకృష్ణ అదే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ మూడోసారి పట్టుబడినట్లు తెలిపారు.

Leave a Reply