ప్రజల కష్టాల్లో తోడుగా.. అర్హులకు ఆర్థిక భరోసా
ప్రజల కష్టాల్లో తోడుగా.. అర్హులకు ఆర్థిక భరోసా
సొంత నిధులతో నూతన పింఛన్లు అందజేసిన టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ
పాయకాపురం, ఆంధ్రప్రభ: ప్రజల కష్టాల్లో తోడుగా నిలుస్తూ, అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా సొంత నిధులతో పింఛన్లు అందజేస్తున్నామని టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ తెలిపారు.
బుధవారం సింగ్‌నగర్ ప్రాంతంలోని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు బొండా సిద్ధార్థ తన సొంత నిధులతో పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవనోపాధి, విద్యా సహాయం అవసరమైన నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత సహాయం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పేదలు, వృద్ధులు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బొండా సిద్ధార్థ తెలిపారు.
