బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధికి సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంగా నిరంతరంగా సోషల్ మీడియా సేవలు అందించి ఉద్యమ చైతన్యం కోసం విస్తృతంగా కృషిచేసిన కటకం బాలరాజు కు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య శాలువా కప్పి సన్మానించారు. పార్టీ బాధ్యులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.