గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ
గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ
నాంపల్లి, ఆంధ్రప్రభ: నాంపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని 32 గ్రామపంచాయతీలలో సర్పంచ్‌లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవసింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై లింగారెడ్డి, ఎంపీడీవో కార్యాలయం వద్ద మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ శర్మ, ఏవో కార్యాలయం వద్ద ఏఈవో బండారు శివ జాతీయ జెండాను ఎగురవేశారు.
పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈ హరీష్, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ శివ ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టౌన్ అధ్యక్షుడు పానుగంటి వెంకటయ్య గౌడ్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ నర్సిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ భవాని, ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ మల్లికార్జున్ రావు, నాంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నక్క చంద్రశేఖర్ జెండా ఆవిష్కరించారు.
అలాగే రాందాస్ తండా సర్పంచ్ మెగావత్ చిట్టి శ్రీనివాస్, చిట్టెంపహాడ్ సర్పంచ్ కోరే దేవేంద్ర సైదులు, గట్ల మల్లేపల్లి సర్పంచ్ మల్లేపల్లి శ్రీనివాస్ రెడ్డి, పసునూర్ గ్రామ సర్పంచ్ గోవర్ధన్, రాజ్య తండా సర్పంచ్ బుజ్జి చందు నాయక్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఫకీర్‌పురం సర్పంచ్ కల్లాల వెంకటరెడ్డి, వడ్డేపల్లి సర్పంచ్ జంపాల లక్ష్మి సైదులు, తుమ్మలపల్లి సర్పంచ్ వాకిటి ప్రమీల, ముష్టిపల్లి సర్పంచ్ జక్కుల మంజుల మల్లేష్, టీపీ గౌరారం సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న కృష్ణారెడ్డి, మెల్లవాయి సర్పంచ్ వంశీ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీవో గుంటుక వెంకటేష్, జేటీవో శ్రవణ్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కొండల్ యాదవ్, అడ్వకేట్ కోరే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
