Nara Lokesh | ర‌ష్యా చేరుకున్న మంత్రి లోకేశ్‌.. ఇంత‌కీ ఏం చేయ‌నున్నారు..

Nara Lokesh | ర‌ష్యా చేరుకున్న మంత్రి లోకేశ్‌.. ఇంత‌కీ ఏం చేయ‌నున్నారు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రష్యా రాజధాని మాస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారులతో పాటు, అక్కడ నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, భారతీయ సంఘాల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. రష్యా గడ్డపై అడుగుపెట్టడం, ఇక్కడి భారతీయ సమాజం నుంచి ఇంతటి ఆత్మీయ స్వాగతం లభించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేశ్ సాషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 7వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రతిష్టాత్మక ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్’ (SPIEF) లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొననున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో ఆయన కీలక చర్చలు జరపనున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణాన్ని, అవకాశాలను వారికి వివరించి.. రష్యన్ కంపెనీలను ఏపీకి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

Leave a Reply